Rajamouli – Mahesh: రాజమౌళి మహేష్ బాబు సినిమా కొత్త అప్ డేట్ ..

Rajamouli – Mahesh: రాజమౌళి RRR మూవీ ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను మార్చి 25 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. RRR తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేయనున్న విషయం అందరికి తెలిసిందే. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవలే వీరు ఇద్దరి మధ్య షూట్ చేసిన కళావతి సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా మంచి వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉంది.

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి సినిమా కు వర్క్ చేయనున్నాడు. ఈ సినిమా విషయం లో రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. అయితే రాజమౌళి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తీయడం కోసం ఇతర భాషల హీరోయిన్స్ ను, విలన్స్ ను ఎంపిక చేసుకుంటున్నారు జక్కన్న. ఇపుడు మహేష్ సినిమా మల్టీ స్టారర్ గా తెరకెక్కనుందనే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీని కోసం కొంతమంది స్టార్ యాక్టర్స్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. సినిమా 40 నిముషాల లీడ్ యాక్టర్స్ తో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. గోపీచంద్ ను కూడా నెగెటివ్ రోల్ కోసం సంప్రదించినట్లు ఫిల్మ్ వర్గాల టాక్. ఈ సినిమాను కాల్ నారాయణ శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా కోసం రాజమౌళి ఏ నటీనటులను రంగంలోకి దింపుతారో తెలియాల్సి ఉంది.