శ్రియకు రాజమౌళి ఇంత ద్రోహం చేశారా !

Rajamouli chops Shriya's scenes in RRR

Rajamouli chops Shriya's scenes in RRR

‘బాహుబలి 1, 2’ తర్వాత రాజమౌళి స్థాయి మారిపోయింది. ఆయన సినిమా అంటే అదొక వండర్. ఆయన సినిమాల్లో నటించడం అనేది చాలామంది నటీనటులకు చిరకాల కోరిక. ఆయన చేసే భారీ సినిమాల్లో ఒక సన్నివేశంలో కనిపించినా చాలని అనుకుంటుంటారు. అలాంటి అవకాశం వచ్చినా కూడ ట్రిమ్మింగ్లో సన్నివేశాలు ఎగిరిపోతే. అంతకంటే బ్యాడ్ లక్ ఇంకొకటి ఉంటుందా. అలాంటి బ్యాడ్ లక్కే ఇప్పుడు శ్రియకు పట్టుకుందట. రాజమౌళి చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో శ్రియ ఒక పాత్ర చేస్తోంది. అది కూడ అజయ్ దేవగన్ సతీమణి పాత్ర.

అజయ్ దేవగన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది కథలో. అందుకే ఆయన మీద ఎక్కువ సీన్స్ రాసుకున్నారట జక్కన్న. అలా రాసుకున్న సన్నివేశాల్లో శ్రియ శరన్ సన్నివేశాలు కూడ ఎక్కువే ఉన్నాయట. ఆమె మీద కొన్ని సీన్లు షూట్ చేశారు కూడ. కానీ ఇప్పుడు సినిమా రన్ టైమ్ పెరిగిపోతోందట. అందుకే జక్కన్న తీసిన సన్నివేశాలను ట్రిమ్ చేసే పనిలో భాగంగా శ్రియ ఉన్న సన్నివేశాలకు కత్తెర వేశారట. కొన్నింటిని ఏకంగా తొలగించేశారట. దీంతో శ్రియ స్క్రీన్ మీద కనబడే నిడివి తగ్గినట్టే. నటిగా శ్రియకు ఇది నిరుత్సాహం కలిగించే విషయమే.