Adire Abhi: తెర ముందు చేసిన యాంకర్ అయినా, ఆర్టిస్ట్ అయినా సరే ఏది చేసిన చాలా బాగుంటుందని జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి అన్నారు. కెమెరా వెనకాల డెరెక్షన్ కావచ్చు, స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, క్రియేటివ్ డైరెక్టర్ కావచ్చు ఇలా తెర వెనుక చేసే వేటికైనా చాలా కష్టపడాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
ఇకపోతే మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు క్రియేటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేసిన అదిరే అభి, మెగాస్టార్‌తో కలిసి పనిచేసిన చాలా మంచి అనుభూతిని కలిగించిందని ఆయన అన్నారు. ఆయన దగ్గర ముఖ్యంగా నేర్చుకున్న అంశమేమిటంటే ఎంత డైరెక్షన్ టీం అయినా కూడా అవతలి వాళ్లు చెప్పేది విని, అది చేయాలా వద్దా అని అడగకపోయినా ఆయన అడగడంలోనే ఏదే తేడా ఉందని మనమే అనుకునేటట్టు చేస్తారని అభి తెలిపారు. ఆయన్ని చూసి పెరిగాం. ఆయన్ని ఇన్స్‌ఫిరేషన్‌గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చామన్న అభి, అంత పెద్ద స్టార్ అయినా కూడా తాము చెప్పింది విని చేసేద్దాం అని సున్నితంగా చెప్పడం చాలా గౌరవంగా అనిపిస్తుందని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా రాజమౌళి గారి దగ్గర బాహుబలి సినిమాకు గాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశానన్న అదిరే అభి, రాజమౌళి అంటే తనకు చాలా అభిమానం అని చెప్పుకొచ్చారు. ఆయన దగ్గర పనిచేశానని కాదు. కానీ తాను ఎవరి నుంచి ఏం నేర్చుకున్నా తనకు అభిమానమే అని ఆయన చెప్పారు. మన తెలుగు సినిమా స్థాయిని ఆయన ఎక్కడికో తీసుకెళ్లారని అభి ప్రశంసల వర్షం కురిపించారు. బాహుబలి షూటింగ్ సమయంలో కూడా టీం అందరితోనూ చాలా సరదాగా గడిపామని ఆయన అన్నారు. రాజమౌళి, ప్రభాస్ ఇంకా తనకు మధ్య చాలా ఫన్నీ సంఘటనలు కూడా జరిగాయని అదిరే అభి వివరించారు. ఏదైనా ప్రభాస్ లేదా రానాకు మధ్య షూటింగ్ జరిగేటప్పుడు వారిద్దరిని ఓకే ప్రేమలో తీసుకురావడానికి నిలబడమని చెప్పేవారు. వారి బదులు నేను వెళ్తే రాజమౌళి గారు నువ్వెక్కడ నీ హైట్ ఎక్కడ పక్కకు జరుగు అనేవారని తెలిపారు.