సౌందర్య వల్లే నేను ఇలా అయ్యాను  అంటున్న రాజా రవీంద్ర

తెలుగు సినిమా లో రాజా రవీంద్ర క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా బాగా పాపులర్. తనకు ఇండస్ట్రీ లో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, యాక్టింగ్ తో పాటు చాలా మంది హీరోలకు మేనేజర్ గా పనిచేసారు రాజా రవీంద్ర. కొన్నాళ్ళు రవి తేజ కు మేనేజర్ గా పనిచేసిన రాజా రవీంద్ర ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బయటకి వచ్చేసి, రాజ్ తరుణ్ కి మేనేజర్ గా పనిచేసారు.

ప్రస్తుతం తెలుగులో నిఖిల్ ,నవీన్ చంద్ర ,మంచు విష్ణు లాంటి హీరోస్ కి మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఈయన సినిమా డేట్ లను అడ్జస్ట్ చేయడంలో మంచి పేరు సంపాదించుకున్నారు.

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆయనకి ఆసక్తికర విషయం ఎదురైంది. ఈ క్రమంలోనే ఆయన చెప్పిన ఆన్సర్ ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇక అసలు విషయం ఏంటంటే..” స్టార్ హీరోలు అందరికీ మేనేజర్ గా ఉన్న మీరు హీరోయిన్ల కంటే ఎందుకు అంత భయపడిపోతారు..? హీరోయిన్లు మిమ్మల్ని మేనేజర్ గా అడిగితే నో చెప్పారట.. నిజమేనా..?” అంటూ యాంకర్ అడిగాడు. దీంతో రాజా రవీంద్ర మాట్లాడుతూ..” నేను హీరోలకి మేనేజర్ గా చేసాను.. కానీ, హీరోయిన్లకి ఎందుకు చేయడం లేదంటే దానికి కారణం సౌందర్యానే.

జనరల్ గా హీరోలు రెండు మూడు సినిమాలు ఓకే చేసి అవి కంప్లీట్ అయ్యాకే మిగతా సినిమాలకు వెళ్తారు. కానీ హీరోయిన్స్ అలా కాదు ఒకేసారి ఐదు ఆరు సినిమాలు ఓకే చేస్తారు. ఒక రోజు ఇక్కడ ఉంటే రేపు చెన్నైలో ఉండాలి అలా కొన్నిసార్లు లేట్ అవుతాయి. ఫ్లైట్స్ డిలే అవుతాయి. అప్పుడు ఆ మేనేజర్ పడే కష్టాలు వర్ణాతీతం . అది నేను కళ్లారా చూశాను. ఒక సందర్భంలో సౌందర్య మేనేజర్ ఏకకాలంలో ఆమె మూడు సినిమాలు ఒప్పుకొని ఎంత ఇబ్బంది పడిందో కళ్లారా చూశాను. హిందీలో అమితాబచ్చన్ సినిమా ..తెలుగులో చిరంజీవి అన్నయ్య సినిమా.. తమిళ్ లో రజనీకాంత్ సినిమా మూడు సినిమాలను ఒకేసారి ఒకే చేసి ఆ టైంలో డేట్స్ సరిగ్గా అడ్జస్ట్ చేయలేక వాళ్ళ మేనేజర్ పడ్డ కష్టాలు అంతా ఇంతా కాదు. అది చూశాక నేను భవిష్యత్తులో ఎప్పుడు హీరోయిన్స్ కి మేనేజర్ గా ఉండకూడదని నిర్ణయించుకున్నాను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.