Prabhas: ప్రభాస్ సరసన ముగ్గురు భామలు.. ఏ సినిమాలో తెలుసా..?

Prabhas: ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా ఈ నెల 11వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవల్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాటు ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కె లాంటి సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ప్రాజెక్ట్ కె సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో కనిపించనున్న విషయం అందరికి తెలిసిందే.

ఈ సినిమా తరువాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటించబోతున్నారు. అయితే ఈ సినిమా కంటే ముందుగా మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ సినిమా చేయనున్నట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఈ సినిమాను డి.వి.వి.దానయ్య నిర్మించనున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ తరపున ముగ్గురు హీరోయిన్ లు నటించబోతున్నారట. ఇప్పటికే ఆ ముగ్గురు హీరోయిన్ లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వారి పేర్లు బయటకు ఇస్తారని సమాచారం.