కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా కేంద్రంపై మండిపడ్డారు. జమ్మూకాశ్మీర్ లోని కాశ్మీరీ పండిట్ల పై ఉగ్రవాదుల దాడులు, హత్యల విషయం పట్ల ఫైర్ అయ్యారు. కాశ్మీర్ పండిట్లు ధర్నా చేస్తుంటే బీజేపీ మాత్రం వేడుకలో బిజీగా ఉందని విమర్శించారు. తాజాగా కుల్గామ్ లో ఉపాధ్యాయులపై జరిగిన కాల్పులు సంగతి తెలిసిందే.
ఈ విషయం గురించి మాట్లాడుతూ.. లోయలు శాంతి భద్రతల పరిస్థితులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి అని.. ప్రధాని గారు.. ఇది సినిమా కాదు నిజం అంటూ .. ఇప్పటికే అక్కడ 15 మంది భద్రతా సిబ్బందిలు అమరులయ్యారు అని.. 18 మంది పౌరులు మరణించారు అని ట్విట్టర్ ద్వారా తెలిపారు.