ప్రళయం అంచున ఉన్న జగన్ సర్కార్.. హాట్ కామెంట్స్ చేస్తున్న ఎంపీ.. ?

Ys Jagan

 

ఎంకి చావు సుబ్బు పెళ్ళికి వచ్చినట్లు ఉందట ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల పరిస్దితి.. ఎందుకంటే విత్తనం పెట్టాలంటే మట్టి తవ్వక తప్పదు అన్నట్లుగా కష్టకాలంలో ఉన్నట్టుగా కనిపిస్తున్న కేంద్ర అధికార పార్టీ బీజేపీ తమతో పొత్తు పెట్టుకున్న ఒక్కో పార్టీ దూరమవుతున్న తీరుకు కాస్త ఆందోళన పడుతుందట. ఈ క్రమంలో ఇక ముందు ఎటువంటి ఇబ్బంది రాకుండా, తమకు అనుకూలంగా ఉండే ప్రాంతీయ పార్టీలతో సఖ్యత గా ఉండేందుకు ప్రయత్నిస్తోందని ప్రచారం సాగుతుంది.. ఈ నేపథ్యంలో బీజేపీ జగన్ కు ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే వైసీపీకి అన్ని రకాలుగా సహకారం అందించేందుకు సిద్ధమవుతోందట.

ఇకపోతే బీజేపీ ఇపుడు విశ్వసనీయత పరీక్ష ఎదుర్కొంటుంది. ఎన్డీయే నుంచి ఒక్కొక్కరూ వెళ్ళిపోతున్నారు. దాంతో ఎవరో ఒకరిని పార్టీలో చేర్చుకోవాలి. అందువల్ల అతి పెద్ద పార్టీగా ఉన్న వైసీపీని ఎన్డీయేలోకి తీసుకురావడం ద్వారా మా బలం పెరిగింది అని చెప్పుకుంటూ, తెలుగు రాష్ట్రాలో ఒక చోట మిత్ర పక్ష ప్రభుత్వం ఉందని ఢంకా భజాయించవచ్చు. ఈ కారణం వల్లనే బీజేపీ ప్రస్తుతం జగన్ ని చేరదీస్తుందని అంటున్నారు కొందరు విశ్లేషకులు.. అయితే ఈ కధలో పావుగా రఘురామకృష్ణంరాజు తెరపైకి వస్తున్నారట.. ఆయన నేరుగా జగన్ మీదకు దాడికి దిగుతూ, జగన్ సర్కార్ ప్రళయం అంచున ఉందని ఏవేవో కారుకూతలు కూస్తున్నారట.. కేవలం వైసీపీ సర్కార్ లోపాల‌ను మాత్రమే తాను ప్రస్తావిస్తున్నాను అని చెప్పుకునే రఘురామకృష్ణంరాజు ఇపుడు జగన్ మీద వ్యక్తిగత దాడికి దిగడం వెనకున్న మతలబు ఏంటి అన్నది చర్చగా మారింది..

 

అయితే ఢిల్లీ కబుర్లు చూస్తే మాత్రం తొందరలోనే జగన్ కి రాజు గారిని మాజీ చేసి కానుకగా ఇస్తారా అన్న డౌట్ వస్తోందట..ఇకపోతే పదే పదే తమ పై ఆరోపణలు చేస్తూ, పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్న రఘురామకృష్ణంరాజుపై ఎప్పటి నుంచో వైసీపీ కూడా ఆగ్రహంగా ఉందట.. ఈ నేపధ్యంలో రఘురామకృష్ణంరాజు పై అనర్హత వేటును ముందుకు తెచ్చి కధ నడపడానికి బీజేపీ తెలివిగా ప్రణాళిక సిద్ధం చేసిందని అంటున్నారు. ఈ రకంగా బీజేపీ వైసీపీ రాయబేరాల్లో ఫస్ట్ బలి అయ్యేది రఘురామకృష్ణంరాజు మాత్రమేనని అంటున్నారు..