Raghavendra Rao – Mohan Babu: రాఘవేంద్రరావుకి ఆ హీరోతో సినిమా చేయద్దని సలహా ఇచ్చిన స్టార్ హీరో… చివరికి ఏమైందంటే?

Raghavendra Rao – Mohan Babu: సినీ ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలకు, నటీనటులకు కొన్ని కొన్ని సార్లు బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు ఆ సమయంలో ఏ సినిమా చేసినా కూడా కలిసిరాదు. ఎంత పెద్ద స్టార్ దర్శకుడు అయినా కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. టాలీవుడ్ స్టార్ దర్శకుడు అయిన రాఘవేంద్ర రావు కూడా తన సినీ జీవితంలో అలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు. 1988, 1990 సమయంలో రాఘవేంద్రరావు చేసిన యుద్ధభూమి, అగ్ని, రుద్రనేత్ర, ఒంటరి పోరాటం ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయాయి.

ఆ సమయంలోనే రాఘవేంద్రరావు ఎన్నో అవమానాలను, సెటైర్ల ను సైతం ఎదుర్కొన్నారు. ఇక అటువంటి సమయంలోనే స్టార్ నటుడు మోహన్ బాబు ని హీరోగా పెట్టి అల్లుడుగారు అనే సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇక మోహన్ బాబు సరసన నటించడానికి రమ్యకృష్ణ హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇక ఆ నిర్ణయం తీసుకోవడంతో రాఘవేంద్ర రావు పై సెటైర్లు మరింత పెరిగాయి. అంతేకాకుండా ఆ సమయంలో ఆ సినిమాకు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత కూడా రాఘవేంద్ర రావు, మోహన్ బాబు కాంబినేషన్ కు సిద్ధంగా లేను అని తప్పుకున్నాడు ఆ సమయంలోనే రాఘవేంద్రరావు కి ఒక స్టార్ హీరో మోహన్ బాబుతో సినిమా చేయవద్దు అని సలహా కూడా ఇచ్చాడట.

మోహన్ బాబుతో సినిమా చేసి కెరీర్ ని పాడుచేసుకోకండి అని రాఘవేంద్రరావు సూచించాడట. అయినప్పటికీ రాఘవేంద్రరావుగారు ఆ స్టార్ హీరో కామెంట్స్ ని పక్కన పెట్టి అల్లుడుగారు సినిమాను పూర్తి చేసి విడుదల చేయగా 1990, జూలై 14 న విడుదలైన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా రమ్యకృష్ణ హీరోయిన్ గా నిలబడింది కూడా ఆ సినిమాతోనే. అలా స్టార్ హీరో రాఘవేంద్ర రావు గారికి ఇచ్చిన సలహాలు కూడా వేస్ట్ అయిపోయాయి.