Home News రాధేశ్యామ్' రిలీజ్ బాలీవుడ్ మీదనే డిపెండ్ అయ్యుంది

రాధేశ్యామ్’ రిలీజ్ బాలీవుడ్ మీదనే డిపెండ్ అయ్యుంది

Radheshyam Release Depends On Bollywood
 
రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’.  ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే.  రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.లాక్ డౌన్ కారణంగా సినిమా చాలా ఆలస్యమైంది.  చిత్రీకరణకు చాలానే అడ్డంకులు ఏర్పడ్డాయి. అయినా అన్ని వ్యయప్రయాసలకు ఓర్చిన మేకర్స్ సినిమాను గత నెలలోనే ముగించాలని అనుకున్నారు.  కానీ సెకండ్ వేవ్ లాక్ డౌన్ మూలంగా షూటింగ్స్ ఆగిపోవడంతో టీమ్ ప్లాన్ భగ్నమయ్యాయి. రెండున్నర నెలల తర్వాత ఇప్పుడు మళ్లీ షూటింగ్స్ మొదలవుతున్నాయి. 
 
దీంతో ప్రభాస్ ఇక ఆలస్యం చేస్తే తగదని భావించి ముందుగా తన డేట్స్ ఈ సినిమాకే కేటాయించడం జరిగింది.  ఈరోజు నుండే లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ సిటీలో మొదలైంది. 10 రోజుల్లో ప్యాచ్ వర్క్ సహా షూట్ మొత్తం పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నారు టీమ్. ఒక సాంగ్, కొన్ని సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక సినిమా విడుదల విషయానికి వస్తే అది బాలీవుడ్ మీదే ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే సినిమాను హిందీలో కూడ భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. అంటే బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ ఉండకూడదు. అందుకే పెద్ద హీరోల సినిమాలు లేని టైమ్ చూసి విడుదల చేయాలనేది టీమ్ ఆలోచనట. మోస్ట్లీ దసరాకు ముందే చిత్రాన్ని విడుదలచేసే అవకాశాలు ఉన్నాయి.  

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News