‘రాధేశ్యామ్’ కోసం కొత్త దార్లు వెతుకుతున్న నిర్మాతలు

Radheshyam producers planning new for release
Radheshyam
చిన్న సినిమాలు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఓటీటీల బాట పడుతున్నాయి.  సినిమా హాళ్లు తెరుచుకునే వీలు లేకపోవడం, ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియకపోవడంతో చిన్న సినిమాలు మంచి డీల్ దొరికితే ఓటీటీలకు వెళ్లిపోతున్నాయి.  సమస్యల్లా పెద్ద సినిమాలకే వచ్చింది.  పెట్టిన పెట్టుబడి మొత్తం ఓటీటీల ద్వారానే రాబట్టాలంటే వీలయ్యేపని కాదు. 
 
ఓటీటీలతో పాటు కొన్ని థియేటర్లలో అయినా సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.  కొన్నిరోజుల క్రితం విడుదలైన సల్మాన్ ఖాన్ ‘రాధే’ దీన్నే ఫాలో అయింది.  జీ ఓటీటీ ద్వారా సినిమాను రిలీజ్ చేశారు.  ఇతర దేశాల్లో అందుబాటులో ఉన్న సినిమా హాళ్లలో కూడ విడుదల చేశారు. 
 
ఇప్పుడు ఇదే పద్ధతిని ‘రాధేశ్యామ్’ ఫాలో కానుందట.  ఇప్పటికే సినిమా రిలీజ్ చాలా ఆలస్యమైంది.  జూలై 30న సినిమా రిలీజ్ పెట్టుకున్నారు.  కానీ రిలీజ్ ఉంటుందా లేదా అనేదే పెద్ద డౌట్.  ఎందుకంటే జూలై 30 నాటికి దేశంలో సినిమా హాళ్లు ఓపెన్ అవుతాయనే నమ్మకం లేదు. 
 
ఒకవేళ ఓపెన్ అయినా పూర్తిగా తెరుచుకుంటాయని చెప్పలేం.  అందుకే ‘రాధేశ్యామ్’ నిర్మాతలు జీ ఓటీటీ ద్వారా సినిమాను విడుదల చేయాలని, అదే టైంలో అందుబాటులో ఉన్న సినిమా హాళ్లలో కూడ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.  మరి వీరి ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.