Radhe Shyam : “రాధే శ్యామ్” రెండో ట్రైలర్ సహా ప్రమోషన్స్ పై బిగ్ అప్డేట్స్ మీకోసం.!

Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “రాధే శ్యామ్” కోసం ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సహా హిందీ భాషల్లో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆల్రెడీ రిలీజ్ కి ప్రింట్ కూడా రెడీగా ఉంది.
ఇంకా ప్రమోషన్స్ మాత్రం స్టార్ట్ చెయ్యాల్సి ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆల్రెడీ మేకర్స్ కొన్ని కీలక పనులు కూడా స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ సినిమాపై రాబోయే అప్డేట్స్ సహా ఈవెంట్స్ పై సమాచారం తెలుస్తుంది. మరి ఈ సినిమా నుంచి ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండో ట్రైలర్ ని రిలీజ్ చెయ్యడం కన్ఫర్మ్ కాగా దానిపై దర్శకుడు ఇంట్రెస్టింగ్ సమాచారం తెలిపాడు.
ట్రైలర్ ఖచ్చితంగా ఉందని అలాగే ఇది సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో రిలీజ్ చేయబోతున్నామని తెలిపాడు. అలాగే మూడు ట్రైలర్ లాగ రిపీటెడ్ షాట్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నామని తెలిపాడు. ఇక ఇంకో బిగ్ అప్డేట్ ఏమిటంటే ఈ సినిమాపై మళ్ళీ రెండు భారీ ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తున్నారట.
ఇవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని తెలుస్తుంది. ఇంకా మరిన్ని సర్ప్రైజ్ లి మేకింగ్ వీడియోలు ప్రోమోలు ఇలా రానున్న మార్చ్ అంతా ఓ రేంజ్ లో ఉండబోతుంది అట. మరి డార్లింగ్ ఫ్యాన్స్ అయితే సిద్ధంగా ఉండండి.