“రాధే శ్యామ్” రెస్పాన్స్ ఏదో తేడాగా ఉందే..?

 

Radhe Shyam Teaser Response Looks Fake | Telugu Rajyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కాంబోలో దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన భారీ పీరియాడిక్ లవ్ డ్రామా చిత్రం “రాధే శ్యామ్”. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి మేకర్స్ నిన్ననే అవైటెడ్ టీజర్ ని రిలీజ్ చేసారు. అయితే దీనిని న్యూట్రల్ గా చూసేవాళ్ళకి గొప్పగా అనిపించినా ప్రభాస్ అభిమానులను పూర్తి స్థాయిలో మెప్పించలేదు.

అయితే దీనిని టీజర్ అని పెట్టకుండా విక్రమ్ ఆదిత్య గ్లింప్స్ అని పెడితే బాగుణ్ణు అనుకున్నారు. సరే ఇది పక్కన పెడితే ఈ టీజర్ కి వస్తున్న భారీ లెవెల్ రెస్పాన్స్ నే కాస్త తేడాగా అనిపిస్తుంది. ఎంత స్టార్డం ఉన్నా కోట్లల్లో వ్యూస్ అయితే ఈ టీజర్ కి వస్తున్నాయి కానీ లైక్స్ లో అసలు విషయం తెలిసిపోతుంది.

వ్యూస్ అమాంతం పెరుగుతున్నాయి కానీ లైక్స్ పెరగకపోవడంతో రాధే శ్యామ్ కి పైడ్ వ్యూస్ పెట్టుకున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సింపుల్ టీజర్ కి కూడా ఇన్ని సడెన్ వ్యూస్ అంటే పక్కాగా పైడ్ పనే అని అంతా అనుకుంటున్నారు. మొత్తంగా మాత్రం ఈ టీజర్ కి కూడా అంత భారీ రెస్పాన్స్ వచ్చేసే అవకాశం కూడా లేదని చెప్పాలి.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles