ఏ మాత్రం తగ్గని ప్రబాస్ జోరు: ఈ సారేంటంటే.!

Radhe Shyam One More Super Surprise On The Way | Telugu Rajyam

ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ పుట్టినరోజు సందర్భంగా ‘రాధే శ్యామ్’ నుండి వచ్చిన టీజర్ ఫ్యాన్స్‌ని ఊపు ఊపేస్తోంది. కాస్త అర్ధమయ్యీ , అర్ధమవనట్లున్నదనే అభిప్రాయం ఉన్నప్టికీ, ఫ్యాన్స్ ఎక్కడా తగ్గకుండా ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇంతటితో ఈ జోరు ఆగేలా లేదు.

త్వరలోనే మరో టీజర్ రిలీజ్ చేయనున్నారనీ తాజా టాక్. అది ఓ సాంగ్ ప్రోమో అవుతుందని అంటున్నారు. అంతేకాదు, ఇకపై సినిమా రిలీజ్ వరకూ ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వకుండా, ఏదో ఒక అప్డేట్ కంటిన్యూస్‌గా ఇస్తూనే ఉంటారట. ఎథిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. వినసొంపుగానే కాదు, విజువల్ వండర్‌గా పాటలను తీర్చిదిద్దేందుకు గ్రౌండ్ లెవల్లో ప్లానింగ్స్ జరుగుతున్నాయట.

‘రాధేశ్యామ్’ అనే పేరులోనే బోలెడంత ప్రేమ పొంగి పొర్లుతోంది. సాధారణంగా ఎన్నో హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీలు చూసే ఉంటాం. కానీ, ‘రాధే శ్యామ్’లో చూపించబోయే లవ్ స్టోరీ మాత్రం సాదా సీదా లవ్ స్టోరీ కానే కాదనీ, ఈ జనరేషన్ సినిమాల్లో ఇదో అద్భుత కళాఖండంగా నిలిచేలా ఈ ప్రేమకథను మలుస్తున్నారనీ ఇన్‌సైడ్ సోర్సెస్ టాక్.

ఇకపోతే, రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి రేస్‌లో జనవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles