Radhe Shyam : “రాధే శ్యామ్”ని రెండు రకాలుగా ప్లాన్ చేస్తున్నారా?ఆ విషయాలు మీకోసం

Radhe Shyam : టాలీవుడ్ సినిమా ఖ్యాతి ఇపుడు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా స్టార్ క్రేజ్ ఇప్పుడు వేరే లెవెల్లో ఉంది. తన బాహుబలి సినిమాల తర్వాత మన తెలుగు కంటే హిందీలో ఎక్కువ మార్కెట్ ప్రభాస్ కి వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

దానికి ఉదాహరణగా తన గత సినిమా సాహో వసూళ్లనే చెప్పొచ్చు. అందుకే ఈసారి నెక్స్ట్ సినిమాని మాత్రం పక్కాగా ప్లాన్ చెయ్యాలి అన్నట్టుగా “రాధే శ్యామ్” సినిమాని ప్లాన్ చేశారు. ఆల్రెడీ తెలుగు మరియు హిందీ పాటలకి డిఫరెంట్ గా సెటప్ చేసి అక్కడే ఎక్కువ అంచనాలు అందుకున్నారు.

అయితే ఈ సినిమాకి ఈ ఒక్క విషయంలోనే కాకుండా ఇంకా చాలా విషయాల్లో రెండు రకాలుగా ప్లాన్ చేస్తున్నారట. సినిమా రన్ టైం లో కూడా తెలుగు మరియు హిందీకి చాలా తేడా ఉంటుందట. అలాగే రాధే శ్యామ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కూడా రెండు రకాలుగా ప్లాన్ చేసినట్టు రీసెంట్ గా దర్శకుడు రాధా కృష్ణ తెలిపాడు.

దీనితో రాధే శ్యామ్ ని ఇష్టపడితే రెండు వెర్షన్ లని చూడొచ్చు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా వచ్చే జనవరి 14న ఈ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.