Radhe Shyam Television Premiere : ఓటిటిలో కన్నా ముందే టీవిలో వచ్చేస్తున్న “రాధే శ్యామ్” సినిమా.!

Radhe Shyam Television Premiere

Radhe Shyam Television Premiere : ఈ ఏడాదికి మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా అంటే అన్ని భాషల్లో కాస్త బజ్ తో విడుదల అయ్యిన సినిమా “రాధే శ్యామ్”. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి దాదాపుగా మూడేళ్ళ తర్వాత వచ్చిన ఈ సినిమా అనుకున్న రేంజ్ హిట్ గా నిలవలేకపోయింది. అంతే కాకుండా ప్రభాస్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచిపోయింది.

మరి దానితోనే ఎక్కువ ఆలస్యం చెయ్యకుండా ఒటీటీలో సౌత్ భాషల్లో రిలీజ్ చేసేసారు. అయితే మరి ఆల్రెడీ ఓటిటి లో వచ్చినా మళ్ళీ రాకుండా టీవిలో ప్రసారం ఏంటి అనుకుంటున్నారా? నిజానికి ఈ సినిమా కేవలం మన దగ్గర మాత్రమే స్ట్రీమింగ్ కి వచ్చింది కానీ హిందీలో మాత్రం ఇంకా రాలేదు.

అలాగే మాములుగా ముందే స్ట్రీమింగ్ కి వచ్చి తర్వాత టీవిలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అవుతాయి. కానీ ఇక్కడ భిన్నంగా ఈ సినిమా ముందు టీవిలో ప్రసారానికి సిద్ధం అయ్యిపోయినట్టుగా చిత్ర యూనిట్ తెలిపారు. ఈ ఏప్రిల్ 24న మధ్యాహ్నం సమయంలో హిందీ భాషలో టెలికాస్ట్ చేస్తున్నారు.

ఇలా హిందీలో మాత్రం ఓటిటి కన్నా ముందే టీవీలో వచ్చేస్తుంది. దీనితో ఓటిటి వీక్షకులు ఆ ప్రింట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి హీరోయిన్ గా పూజా హెగ్డే నటించగా దర్శకుడు రాధా కృష్ణ డైరెక్షన్ చేసాడు. అలాగే యూవీ క్రియేషన్స్ వాళ్ళు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.