Radhe Shyam : మన టాలీవుడ్ నుంచి వెళ్లి పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయ్యిన ఫస్ట్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించినా ప్రభాస్ మాత్రమే ఈ లిస్ట్ లో మొట్టమొదటి హీరోగా నిలదొక్కుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ కి కాస్త బ్యాడ్ టైం నే నడుస్తుండగా తన రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు భారీ ప్లాప్స్ గా నిలిచాయి.
అయితే వీటిలో “సాహో” పరవాలేదు కానీ కానీ లేటెస్ట్ గా రిలీజ్ అయ్యిన “రాధే శ్యామ్” పరిస్థితి అయితే ఘోరం అని చెప్పాలి. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 200 కోట్లకి పైగా బిజినెస్ జరపగా ఇప్పటికీ 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకోకపోవడం ఆసక్తిగా మారింది. ఇక ఇది పక్కన పెడితే సినీ వర్గాల్లో మాత్రం ఈ చిత్ర మేకర్స్ ఈ సినిమా ఏకంగా 400 కోట్ల క్లబ్ లో చేరినట్టుగా ప్రచారం చేస్తున్నారు.
అసలు భారీ ప్లాప్ అయితే ఈ 400 కోట్ల గోల ఏంటా అని అందరికీ సందేహం ఇప్పుడు వస్తుంది. అయితే ఈ సినిమాకి నిజంగానే ఎంత వసూళ్లు వచ్చాయో కానీ ఇండస్ట్రీ వర్గాలు వారు చెప్తున్నా దాని ప్రకారం అయితే ఈ సినిమాకి థియేట్రికల్ గా 200 కోట్లు గ్రాస్ వచ్చిందట అయినా 200 కోట్లు బ్యాలన్స్ ఉంది కదా అనుకుంటే దీనికి కూడా ఒక థియరీ చెప్తున్నారు.
ఈ సినిమా డిజిటిల్ మరియు శాటిలైట్ హక్కులు కూడా కలిపేసి ఈ 400 కోట్ల లెక్కలు చెబుతున్నారు. సో ఇలా రాధే శ్యామ్ 400 కోట్లు కలెక్ట్ చేసింది అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఓవరాల్ గా అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ ప్లాప్ గానే నిలిచింది.