Radhe shyam : ఎన్నో అంచనాల నడుమ ఈ ఏడాదికి మొదటి భారీ పాన్ ఇండియా రిలీజ్ గా వచ్చిన చిత్రం “రాధే శ్యామ్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఒక ఎపిక్ లవ్ స్టోరీగా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించాడు. అయితే ఎందుకో ఈ చిత్రం లాస్ట్ చేసి అంచనాలు అందుకోలేక నిమిట మాత్ర వసూళ్లు మాత్రమే అందుకొని షాక్ ఇచ్చింది.
అయితే ప్రభాస్ కి ఎంతో కీలకమైన హిందీ మార్కెట్ లో ఈ సినిమా సత్తా చాటలేకపోవడం మరింత షాకింగ్ అంశంగా మారగా బాలీవుడ్ వర్గాలు “రాధే శ్యామ్” ని దానికి వస్తున్న వసూలు చూసి ఆల్రెడీ ప్లాప్ గా డిక్లేర్ చేసేసారట. ఏమాత్రం ఆకట్టుకునేలా వసూళ్లు రాకపోవడంతో అసలు ఈ సినిమాకి జరిగిన బిజినెస్ ని అయిన రాబతయా లేదా అని అనుమానం గా మారింది.
ఈ సినిమాకి అక్కడ దాదాపు 50 నుంచి 55 కోట్ల మధ్యలో బిజినెస్ జరగగా ఓవరాల్ గా ఆ మొత్తం కూడా అందుకోవడం కష్టమే అని తెలుస్తోంది.
దీనితో బాలీవుడ్ మీడియా వర్గాలు రాధే శ్యామ్ ని ఆల్రెడీ ప్లాప్ గా డిక్లేర్ చేశారట. అయితే అక్కడేమో కానీ మన దగ్గర మాత్రం రాధే శ్యామ్ కి ఈ మూడు రోజులూ భారీ వసూళ్లు దక్కాయి. మరి ఫైనల్ గా 200 కోట్ల షేర్ టార్గెట్ ని రాధే శ్యామ్ రీచ్ అవుతుందో లేదో చూడాలి అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.