Radhe Shyam : అక్కడ స్ట్రాంగ్ గా ఇక్కడ డల్ గా “రాధే శ్యామ్”..ఎందుకో తెలీట్లేదట.!

Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ విజువల్ ట్రీట్ చిత్రం “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా రిలీజ్ కి జస్ట్ ఒక్క రోజు దూరంలో ఉంది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా అదరగొట్టింది.
అయితే కొన్ని రోజులు ముందే బుకింగ్స్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం ఓవర్సీస్ సహా మన దగ్గర కూడా సాలిడ్ బుకింగ్స్ కనబరిచింది. మరి ఇదిలా ఉండగా ఓవర్సీస్ లో రాధే శ్యామ్ పరిస్థితి ఇప్పుడు కాస్త ఆసక్తిగా మారిందట. యూఎస్ ఏ బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ సినిమాలో మొదట్లో బాగానే టికెట్స్ బుకింగ్ జరుపుకున్నా ఇప్పుడు మాత్రం లాస్ట్ రెండు రోజులకి వచ్చినా మొత్తం స్పీడ్ తగ్గిపోయిందట.
దీనితో ఇప్పుడు లాస్ట్ చేసి డల్ అయ్యిపోయిందట. కానీ మరో దేశం యునైటెడ్ కింగ్ డం లో మాత్రం రాధే శ్యామ్ సత్తా చాటుతుందట. అక్కడ అయితే ఒక్క మన తెలుగు సినిమాల్లోనే కాకుండా ఇండియన్ సినిమాల రిలీజ్ లలోనే స్ట్రాంగ్ బుకింగ్స్ ని కనబరుస్తుండగా.
మరి లాస్ట్ చేసి యూఎస్ లో ఈ సినిమా ఎందుకు స్లో అయ్యిందో అనేది ట్రేడ్ వర్గాలకి అర్ధం కాకుండా మారిందట. మరి దీనితో అసలు 1 మిలియన్ మార్క్ ప్రీమియర్స్ ని ఈ చిత్రం అందుకుంటుందా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారినట్టు వినికిడి.