Radhe Shyam : ఈ ఒక్క సాంగ్ తో “రాధే శ్యామ్” పై ఒక్కసారిగా భారీ అంచనాలు.!

Radhe Shyam : ఏ సినిమాకి అయినా ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉండాలి అనేది సగానికి సగం ఆ సినిమా పాటలే డిసైడ్ చేసేస్తాయి అని చెప్పాలి. అలా ఇప్పటివరకు వచ్చిన పలు సినిమాలు ఎన్నో పాటల వల్ల కూడా హిట్ అయ్యినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కోవలోకే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ సినిమా “రాధే శ్యామ్” కూడా ఉంటుందని చెప్పాలి.

అయితే తెలుగు ఆల్బమ్ ఏమో కానీ హిందీలో సాంగ్స్ తో అయితే ఈ సినిమాపై అంచనాలు అక్కడ పీక్స్ లోకి వెళ్లిపోయాయి. కానీ మన తెలుగులో మాత్రం ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ అతి పెద్ద హిట్ అయ్యింది. ఈ రాతలే అంటూ స్టార్ట్ అయ్యిన ఈ సాంగ్ ని అప్పట్లో కొత్తగా ప్లాన్ చేసి రిలీజ్ చేశారు.

అయితే సాంగ్ కి అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఇప్పుడు అయితే వీడియో సాంగ్ ని చిత్ర బృందం రిలీజ్ చేసారు. ఇక ఇది చూసాక అయితే ఈ సాంగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పాలి. అద్భుతమైన విజువల్స్ తో ఈ సాంగ్ నిజంగా హాలీవుడ్ లెవెల్లో కనిపిస్తుంది. అలాగే కంప్లీట్ గా ఇటలీ లో కనిపిస్తున్న దృశ్యాలతో సాలిడ్ గా కనిపిస్తుంది.

ఈ లెక్కన సినిమాలో గ్రేట్ లవ్ స్టోరీ అందులోని ప్రపంచ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా కూడా ఉన్నాయని చెప్పాలి. ఎలాగో మొత్తం 7 భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది కాబట్టి ఈ సినిమా డెఫినెట్ గా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది అప్పుడు ఖచ్చితంగా అక్కడ కూడా హిట్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పి తీరాల్సిందే.

Ee Raathale Video Song [4k] | Radhe Shyam | Prabhas,Pooja Hegde | Justin Prabhakaran | Krishna K