Radhe Shyam Director: ఈ ఏడాదికి ఒక్క మన టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా భారీ డిజాస్టర్ గా నిలిచిన చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా అయినటువంటి “రాధే శ్యామ్” కూడా ఒకటి. ఎన్నో అంచనాలు సంవత్సరాలు తర్వాత వచ్చిన ఈ సినిమా షాకింగ్ రెస్పాన్స్ ని అన్ని భాషల్లో అందుకొని డిజాస్టర్ గా నిలిచింది.
దీనితో ఆల్ మోస్ట్ అన్ని చోట్లా కూడా నష్టాలనే మిగిల్చిన ఈ చిత్రం విషయంలో అందరికన్నా ఎక్కువ డిజప్పాయింట్ అయ్యింది మాత్రం ప్రభాస్ అభిమానులే అని చెప్పాలి. ఏకంగా ఒక అభిమాని అయితే ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. దీనితో అందరూ దర్శకుడు రాధా కృష్ణనే టార్గెట్ చేసేసారు.
ప్రభాస్ లాంటి హీరో మంచి ఛాన్స్ ఇస్తే ఇలాంటి సినిమా తీస్తాడా అని చాలా కోపంగా ఉన్నారు. మరి అది నిజమే అని ప్రభాస్ దర్శకుడు ఇప్పుడు ప్రూవ్ చేసాడు. తాను తాజాగా ఈ ఈద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయగా ఆ పోస్ట్ లో రిప్లై లు ఇచ్చే ఆప్షన్ ని మాత్రం తీసేసాడు.
అంటే ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ వస్తాయని ముందే ఊహించి చేసాడని అర్ధం అయ్యిపోతుంది. అయితే ఇలాంటి పరిస్థితి చూస్తే మాత్రం ఏ దర్శకునికి అయినా పాపం అనాల్సిందే. ఎక్కడో చిన్న మిస్ కమ్యూనికేషన్ తో అయితే ఈ సినిమా ప్రేక్షకుల్లోకి సరిగ్గా వెళ్ళలేదు. దాని ప్రభావమే ఇదంతా చెప్పాలి.
Wishing you all a Very Happy Akshaya Tratiya and Eid 🤗🤗🤗
— Radhaa Krishna (@director_radhaa) May 3, 2022