Radhe Shyam : ప్రభాస్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా ఫిలిం ‘రాధేశ్యామ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది.! సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయ్. ప్రభాస్, పూజా హెగ్దే సహా ‘రాధేశ్యామ్’ టీమ్ సినిమాని ప్రమోట్ చేయడం కోసం దేశంలోని ప్రముఖ నగరాల్లో చక్కర్లు కొట్టేస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల రగడ ఓ కొలిక్కి రాలేదు. ‘భీమ్లానాయక్’ సినిమాకి సమోసా ధర కంటే తక్కువ ధరకు కొన్ని చోట్ల టిక్కెట్లను అమ్మించింది అక్కడి ప్రభుత్వం. ‘నిబంధనలకు లోబడే సుమీ..’ అంటూ కవర్ డ్రైవ్ అధికార పార్టీ నాయకులు, అందునా మంత్రులు బాగానే చేశారు.
ఔను, ‘భీమ్లానాయక్’ సినిమాకి దారుణమైన దెబ్బ తగిలింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వసూళ్ళ పరంగా. అదే దెబ్బ ‘రాధేశ్యామ్’ సినిమాకి తగిలితే, అది ఇంకా ఇంకా దారుణంగా వుంటుందన్నది నిర్వివాదాంశం. అయితే, ‘భీమ్లానాయక్’ సినిమాని రాజకీయ కోణంలో దెబ్బతీశారుగానీ, ‘రాధేశ్యామ్’ సినిమాకైతే ప్రత్యేకంగా వెసులుబాట్లు కల్పిస్తారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం.. అంటూ ‘కుంటి సాకు’ వెతుక్కున్నారో మంత్రి.. టిక్కెట్ల ధరల పెంపు వ్యవహారానికి సంబంధించి. ఆ కవర్ డ్రైవ్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందనుకోండి.. అది వేరే సంగతి.
ఇదిలా వుంటే, ‘రాధేశ్యామ్’ టీమ్ చాలా వర్రీ అవుతోందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాము ఆశించిన వెసులుబాటు కల్పిస్తుందా.? కల్పించదా.? అని. ఎందుకు కల్పించదు.? ‘అఖండ’ సినిమానీ, ‘పుష్ప’ సినిమానీ చూసీ చూడనట్టు వదిలేయలేదా.? ఇదీ అంతే.. ఒకవేళ పెంపు ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రభుత్వంమొహమాటపడితే.!