Radhe Shyam Collections : బాక్సాఫీస్ : హైదరాబాద్ సిటీ లో ఆల్ టైం రికార్డ్ సెట్ చేసిన “రాధే శ్యామ్” వసూళ్లు.!

Radhe Shyam Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “రాధే శ్యామ్” ఫైనల్ గా ఈరోజు రిలీజ్ అయ్యింది. అయితే ప్రభాస్ స్టార్డం కోసం ప్రత్యేకంగా తెలుగు ఆడియెన్స్ కి చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ హీరోగా చేసిన అన్ని సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ దక్కుతాయి. మరి అలాగే టాక్ తో సంబంధం లేకుండా ఇది వరకే భారీ సినిమా అయిన “సాహో” దుమ్ము లేపింది.
ఇక ఇప్పుడు రాధే శ్యామ్ వంతు రాగా హైదరాబాద్ సిటీ లో అదిరే వసూళ్లను ఈ చిత్రం రాబట్టినట్టు కన్ఫర్మ్ అయ్యింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కేవలం హైదరాబాద్ సిటీ బుకింగ్స్ లో ఏకంగా ఆరున్నర కోట్ల షేర్ ని అందుకుందట.
దీనితో టాలీవుడ్ లో ఆల్ టైం రెకార్డ్ నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనికి ముందు పవర్ స్టార్ లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్ 6 కోట్లకి పైగా షేర్ ఉండగా దానిని ఇప్పుడు రాధే శ్యామ్ బ్రేక్ చేసింది. ఇక దీనితో పాటుగా టోటల్ నైజాం లో వసూళ్లకు సంబంధించి వివరాలు రావాల్సి ఉంది.
ఇక ఈ భారీ విజువల్ ట్రీట్ ని దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించగా పూజా హెగ్డే ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. అలాగే కృష్ణం రాజు, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.