Rachakonda Police Commissionerate: ఆన్‌లైన్ మోసాలు వంటి సైబర్ నేరాలు చాలా గణనీయంగా పెరిగాయి. గత ఏడాదిలోనే దాదాపు 2.7 కోట్ల మంది మోసపోయారు. ఇక దొంగలు వారి వ్యక్తిగత ఇంకా సున్నితమైన వివరాలను వెలికితీసి అనుకోని వ్యక్తుల ఖాతాల నుండి డబ్బును దొంగిలించారు. అలాంటి మోసాలలో డబ్బు కోల్పోవడం అనేది చాలా బాధని కలిగిస్తుంది. అంతేకాకుండా మానసికంగా కుంగి పోతారు. . ఏదేమైనా, కొన్ని సాధారణ పద్ధతులను అనుసరించడం ద్వారా, వారి డబ్బును ఈజీగా తిరిగి పొందవచ్చు. తెలియని వారికి ఇంకా అలాగే ఆన్‌లైన్ లావాదేవీలు ఇంటర్నెట్ ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీల వల్ల పోగొట్టుకున్న డబ్బుని పొందవచ్చు అని రాచకొండ పోలీసులు తెలిపారు.
సైబర్ నేరస్థుల నుంచి డబ్బులు పోగుట్టుకున్న బాధితులకు రాచకొండ పోలీసులు తీపి కబురు అందించారు. ఆన్ లైన్ లో ఆర్ధిక మోసానికి గురైన భాదితులకు రాచకొండ పోలీసులు మంచి వెసులుబాటుని కల్పించారు. ఆర్థిక మోసానికి గురైన వెంటనే బాధితులు ఆలస్యం చేయకుండా 155260 లేదా 100 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలనుకున్నారు. దీనితో పోగొట్టుకున్న డబ్బును తిరిగే పొందే అవకాశం ఉందని వెల్లడించారు. అనుమానాస్పదంగా కనిపించే లేదా ఫోన్ కు వచ్చే లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని రాచకొండ పోలీసులు హెచ్చరించారు.