Raashi Khanna : రాశీ ఖన్నాకి జ్ఞ్యానోదయం అయ్యిందా? వైరల్ గా మారిన ఆమె పోస్ట్.!

Raashi Khanna : మన సౌత్ ఇండియన్ సినిమాతో మంచి ఫేమ్ ని అలాగే చాలా త్వరగా స్టార్డం ని తెచ్చుకున్న యంగ్ అండ్ గ్లామరస్ స్టార్ హీరోయిన్స్ లో రాశీ ఖన్నా కూడా ఒకామె. అయితే ఈమె ఈ లిస్ట్ లోనే కాకుండా తెలుగు సినిమాలో ఫేమ్ తెచ్చుకొని ఇతర భాషల్లోకి ముఖ్యంగా బాలీవుడ్ కి వెళ్ళగానే సౌత్ ఇండియా సినిమాపై అలాగే తెలుగు సినిమాపై కామెంట్ చేసే హీరోయిన్స్ లో ఈమె కూడా చేరింది.
అయితే ఈమె ఇటీవల హిందీలో ఓ వెబ్ సిరీస్ చేసింది. ఎందుకో అక్కడికి వెళ్ళగానే తెలుగు సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె తెలుగులో సినిమాలు చెయ్యడం వల్ల తనలో టాలెంట్ ని కూడా మర్చిపోయానని ఓ రేంజ్ లో ఏవేవో మాటలు మాట్లాడింది. దీనితో అక్కడ నుంచి ఈమె పై తెలుగు ఆడియెన్స్ బాగా నెగిటివిటీ లో ఉన్నారు.
మరి ఇవన్నీ ఈమె దృష్టికి వచ్చాయో కానీ ఇప్పుడు ఏమైందో కానీ తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెబుతూ తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. మరి ఇంత సడెన్ గా అందులో తెలుగులోనే చెప్పడం ఓ రకంగా ఆలోచించేలా చేసింది.
అయితే ఇదంతా మళ్ళీ తెలుగు ఆడియెన్స్ కి దగ్గర అవ్వడం కోసమే అని అంతా అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఈమె చేసిన పనికి తెలుగులో ఆఫర్స్ ఇవ్వద్దని ఆడియెన్స్ మాత్రం చాలా గట్టిగా చెబుతున్నారు.
మరి ఈమె ఫ్యూచర్ తెలుగు సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.
instagram.com/p/Cb1mw0frH2t/?utm_source=ig_web_copy_link