Vastu Tips: మీ ఇంట్లో ఇలాంటి ఫోటోలు ఉంటే అదృష్టం మీ వెంటే..!

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో అలంకరించుకునే వస్తువులు కూడా సరైన వాస్తును కలిగి ఉంటే మన ఇంటికి అదృష్టం కలిసి వస్తుందని చాలా మంది భావిస్తారు. ఈ క్రమంలోనే మన ఇంట్లో అలంకరించుకునే ప్రతి ఒక్క చిన్న వస్తువు విషయంలో కూడా వాస్తు నియమాలను ఆలోచించి కొనుగోలు చేసి వాటిని అలంకరిస్తారు. ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎంతో శుభ సంకేతం అని చెప్పవచ్చు. మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే….

వాస్తు శాస్త్రం ప్రకారం చేప బొమ్మలు ఉన్నటువంటి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం శుభసూచకం.ఇలాంటి ఫోటో ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులకు ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు ఉంటుందని భావిస్తారు. అలాగే కొండల నడుమ సూర్యోదయం అవుతున్న టువంటి ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ఇంటి పై అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ఈ విధమైనటువంటి ఫోటోలను పెట్టుకోవడం ఎంతో శుభసూచకం.

నీటి ప్రవాహం ఏర్పడే ఫోటోలు కూడా అదృష్టానికి సంకేతము అయితే అల్ల కల్లోలం సృష్టించే సముద్రాలు, సుడిగుండం, నదులు వంటి ఫోటోలను ఇంట్లో పెట్టుకోకూడదు. అలాగే మన కుటుంబ సభ్యుల ఫోటోలను మన ఇంట్లో పెట్టుకోవడం మనం చూస్తుంటాము.అయితే అందరూ కూడా ఆ ఫోటోలలో ఎంతో చక్కగా నవ్వుతూ సంతోషంగా ఉన్న ఫోటోలను మాత్రమే తగిలించాలి. ఇలాంటి ఫోటో ప్రతిరోజు మనం చూడటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అందుకే ఈ విధమైనటువంటి ఫోటోలను మన ఇంటిలో ఉంచుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.