Puspha Item Song: అదిరిపోయిన పుష్ప ఊ అంటావా మావ ఊఊ అంటావా మేల్ వెర్షన్!

Puspha Item Song: సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రంలోనే ఊ అంటావా మావ ఊఊ అంటావా అనే ఐటం సాంగులో సమంత అద్భుతమైన స్టెప్పులతో ప్రేక్షకులను సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ పాట విడుదలైన కొద్ది రోజుల్లో ఏకంగా 34 మిలియన్ వ్యూస్ దక్కించుకొని ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. అదే విధంగా ఈ పాట పై కొన్ని వ్యతిరేకతలు కూడా ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ పాట నుంచి
మేల్‌ వెర్షన్‌ బయటకు వచ్చింది.

ఒరిజినల్‌ వెర్షన్‌లో ఉన్న లిరిక్స్‌నే తీసుకొని.. ‘‘మీ కళ్లల్లోనే వంకర ఉంది. ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా పాప ఊఊ అంటావా’’ అంటూ మార్చి పాడిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ పాటను వాలి అనే ఒక నెటిజన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉండగా ఈ పాటలో పవన్ కళ్యాణ్
తమ్ముడు’, ‘అత్తారింటికి దారేది’, ‘బిల్లా’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ‘వేదం’, ‘ఖైదీ నం: 150’ చిత్రాల్లోని పలు ఫేమస్‌ స్టెప్పులతో ఈ క్లిప్‌ను క్రియేట్ చేశారు.

ఇలా సమంత ఐటమ్ సాంగ్ లో ఒకేసారి పవన్ కళ్యాణ్ ప్రభాస్ అల్లు అర్జున్ చిరంజీవి వంటి హీరోలు సైతం కాలు కదపడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు సాంగ్ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీరు ఓ లుక్ వేయండి.