కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు పెద్ద సినిమాలన్నీ వాయిదాలు పడుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాలు వెనక్కు వెళ్లగా త్వరలో మిగతా సినిమాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. ‘పుష్ప, కెజిఎఫ్-2’ చిత్రాలు కూడ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే. ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ‘కెజిఎఫ్-2’ను జూలై 16న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడది కుదిరేలా లేదు. సో.. రిలీజ్ డేట్ మార్చాల్సిందే. ఇక బన్నీ, సుకుమార్ ‘పుష్ప’ కూడ వెనక్కి వెళ్లేలానే ఉంది.
ఆగష్టు 13న సినిమా రిలీజ్ పెట్టుకోగా ఇంకా షూట్ పూర్తికాలేదు. ఎప్పుడు అవుతుందో చెప్పేలేని పరిస్థితి. సో.. వాయిదా ఖాయం అంటున్నారు. ఇక్కడున్న ఇంకో సమస్య ఏమిటంటే ‘కెజిఎఫ్-2, పుష్ప’ రెండూ కూడ అక్టోబర్ నెలలోనే రిలీజ్ అయ్యేలా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ తమ సినిమా ఆక్టోబర్ నెలలో రిలీజ్ అయితే బాగుంటుందని భావిస్తుండగా ఇప్పుడు ‘పుష్ప’ అదే నెలలో రావొచ్చని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే బాక్సాఫీస్ క్లాష్ ఖాయం. రెండూ పాన్ ఇండియా సినిమాలే. తెలుగులో అయితే ‘పుష్ప’ ముందు ‘కెజిఎఫ్-2’ తట్టుకుని నిలబడటం అంత ఈజీ అయితే కాదు. జరిగిన భారీ ప్రీరిలీజ్ బిజినెస్ వెనక్కి రావాలంటే సోలో రిలీజ్ ఉండాల్సిందే. కానీ అది కుదిరేలా లేదు. ఇకపోతే బన్నీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకోవడం, అది కుదరకపోవడం తెలిసిందే.