Pushpa The Rise Got Solid TRP : ఫస్ట్ టైం టెలికాస్ట్ లో భారీ టీఆర్పీ రేటింగ్ అందుకున్న “పుష్ప”.!

Pushpa The Rise Got Solid TRP

Pushpa The Rise Got Solid TRP : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా లెవెల్లో ఐకాన్ స్టార్ గా మార్చివేసిన తాజా చిత్రం “పుష్ప“, “పుష్ప ది రైజ్“. తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యి భారీ వసూళ్లతో తెలుగు మరియు హిందీ బాక్సాఫీస్ దగ్గర రికార్డు కాసుల వర్షాన్ని కురిపించింది.

మరి ఈ చిత్రం గత కొన్ని రోజులు కితమే తెలుగులో టెలివిజన్ తెరపై ఫస్ట్ టైం టెలికాస్ట్ కి ప్రసారం కాగా ఇప్పుడు ఈ గురువారం బార్క్ నుంచి వచ్చిన ఫలితాల్లో ఈ సినిమా టీఆర్పీ రికార్డ్ బయటకి వచ్చింది. అయితే ఈ చిత్రానికి గాను ఏకంగా 22.50 టీఆర్పీ రేటింగ్ వచ్చిందట.

ఇది అల్లు అర్జున్ కెరీర్ లో రెండో అత్యధికం అని చెప్పాలి. గతంలో తాను నటించిన అల వైకుంఠపురములో సినిమా 29.4 రేటింగ్ తో ఇంకా టాప్ 1 లోనే ఉండగా పుష్ప మాత్రం టాప్ 5వ సినిమాగా రిజిస్టర్ అయ్యినట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే వెండితెరపై, తర్వాత ఓటిటి లో ఇప్పుడు టెలివిజన్ తెరపై కూడా ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ అయ్యిందని చెప్పాలి.

ఇక ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్ గా రష్మికా నటించగా సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఫహద్ ఫాజిల్ మరియు సమంతా లు స్పెషల్ పాత్రల్లో మెరవగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇచ్చాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.