Pushpa The Rise : ఔనా, ‘పుష్ప ది రైజ్’తో నష్టాలు వచ్చాయా.?

Pushpa The Rise : వంద కోట్లు ఎప్పుడో కొల్లగొట్టేసింది.. రెండొందల కోట్లు.. ఆ పైన వసూలు చేసింది.. అంటూ అల్లు అర్జున్ వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘పుష్ప ది రైజ్’ సినిమా గురించి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. మేకర్స్ కూడా ఈ సినిమా రికార్డు వసూళ్ళను సాధించిందనే చెబుతుండడం గమనార్హం.

ఇంతకీ, ‘పుష్ప’ సినిమా రిజల్ట్ ఏంటి.? మొదటి పార్ట్.. ‘పుష్ప ది రైజ్’ అంచనాల్ని అందుకోలేకపోయిందంటూ జరుగుతున్న ప్రచాంలో నిజమెంత.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల ‘పుష్ప ది రైజ్’ నష్టాల్ని చవిచూసిందన్నది ఓ వాదన. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఓకే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ‘పుష్ప’కి నష్టాలొచ్చాయట. హిందీలో ఫర్వాలేదట. ఇతర దేశాల్లోనూ పెద్దగా ‘పుష్ప’ ఆకట్టుకోలేకపోయిందట వసూళ్ళ పరంగా.

కొందరు ట్రేడ్ పండితులు చెబుతున్న విశ్లేషణ చూస్తే, పుష్ప జస్ట్ యావరేజ్ అంతే. దాన్ని ‘కెజిఎఫ్’, ‘బాహుబలి’ లాంటి సినిమాలతో పోల్చడం సబబు కాదన్నది పలువురు సినీ విశ్లేషకుల అభిప్రాయంగా కనిపిస్తోంది.

అయితే, బాలీవుడ్ ట్రేడ్ వర్గాల నుంచి ‘పుష్ప’కి మంచి రేటింగ్స్ పడ్డాయి. హిందీలో ‘పుష్ప ది రైజ్’ లాస్ వెంచర్ కాదనీ, లాభాల వెంచర్.. అనీ అంటున్నారు. ఇంతకీ, ఏది నిజం.?

ఏమోగానీ, ‘అమెజాన్ ప్రైమ్’ ద్వారా ‘పుష్ప ది రైజ్’ అలరించబోతోంది. సినిమా థియేటర్లలో విడుదలై నెల రోజులు కాకుండానే ఇలా ఓటీటీలో వచ్చేస్తుండడంపైనా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి వసూళ్ళ పరంగా ‘పుష్ప ది రైజ్’కి అడ్వాంటేజ్ వున్నా, దాన్ని చెడగొడుతున్నారని అభిమానులు గుస్సా అవుతున్నారు.