Pushpa : బాలీవుడ్లో దుమ్ము లేపుతున్న “పుష్ప”.. రిపబ్లిక్ డే కి నమ్మశక్యం కానీ వసూళ్లు.!

Pushpa : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “పుష్ప పార్ట్ 1” టోటల్ పాన్ ఇండియా వైడ్ సాలీడ్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా అందుకున్న విజయం కోసం అయితే తెలుగు మరియు హిందీలో మాట్లాడుకోవాలి. తెలుగులో మూడు వారాల పాటు స్ట్రాంగ్ వసూళ్లు అందుకున్నా ఆ తర్వాత కరోనా మూలాన నెమ్మదించింది.

ఆ తర్వాత ఓటిటి యాప్ అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. కానీ హిందీలో అయితే అప్పటికీ మంచి వసూళ్లు అందుకుంటున్నా కారణంగా హిందీలో లేట్ గా స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. ఎలాగో ఓటిటిలో వచ్చేసింది కదా థియేటర్స్ లో రన్ అయ్యిపోయింది అనుకుంటే పొరపాటే..

నిన్న జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఎలాగో సెలవు దినం అని తెలిసిందే. మరి ఈరోజు పుష్ప షాకింగ్ అండ్ సెన్సేషనల్ వసూళ్లు బాలీవుడ్ టౌన్ లో అందుకున్నట్టు బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. నిన్న ఒక్కరోజే 1.50 కోట్లు ఈ చిత్రం వసూలు చేసిందట.

దీనితో ఈ మార్క్ చూసి ఇతర ఇండస్ట్రీ వర్గాలు వారు షాక్ అవుతున్నారు. మొత్తానికి మాత్రం పుష్ప హవా హిందీలో ఈ రేంజ్ లో ఉంది. ఇక ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. అలాగే సమంతా ఒక సూపర్ సాంగ్ కూడా చేసింది.