వీడియో కాల్ లో “పుష్ప 2” ముగ్గురు దిగ్గజాలు..ఫోటో వైరల్.!

pushpa movie : గత ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయాన్ని నమోదు చేసిన చిత్రం “పుష్ప పార్ట్ 1”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా తో దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది.

పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి అల్లు అర్జున్ కెరీర్ లోనే ఒక అత్యధిక గ్రాసర్ గా నిలిచిన ఈ సినిమాకి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర సౌత్ సినిమాలు అందులోని సీక్వెల్స్ భారీ హిట్స్ అవుతుండడంతో ఈ సినిమాపై కూడా అనేక అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాని వేరే లెవెల్లో నిలబెట్టింది ఎవరు అంటే అల్లు అర్జున్ మినహా దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అలాగే ఈ సినిమాకి అన్ని పాటలు అందించిన రచయిత చంద్రబోస్ లే అని చెప్పాలి. ఈ ముగ్గురు దిగ్గజాలు పాటలు రూపంలో చేసిన మ్యాజిక్ ఇండియన్ వైడ్ ఇప్పటికీ ట్రెండ్ గా అవుతుంది.

మరి ఈ సెన్సేషనల్ ట్రయో రీసెంట్ గా ఒక వీడియో కాల్ మాట్లాడినట్టుగా దేవిశ్రీ ప్రసాద్ తెలిపాడు. పుష్ప 2 మ్యాజిక్ నేను వెయిట్ చేస్తున్నామని దానికోసమే ముగ్గురం మాట్లాడుకున్నామని దేవి ఇందులో తెలిపాడు. దీనితో ఈ వీడియో కాల్ స్క్రీన్ షాట్ ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.