Pushpa Movie: వేట మొదలెట్టిన పుష్ప.. బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన బన్నీ

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు “పుష్ప : ది రైజ్ – పార్ట్ 1” కోసం చాలా ఉత్సాహంగా ఉన్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప : ది రైజ్ – పార్ట్ 1 డిసెంబర్ 17న విడుదల కానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఈ చిత్రం ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాగా, తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నారు.

టాలీవుడ్‌లో ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ‘పుష్ప’ ఒకటిగా నిలవనున్నది టాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. పుష్ప సినిమాలో నటన పరంగా అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ అండ్ నేషనల్ అవార్డ్ వర్తీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చిత్ర యూనిట్ తెలిపారు. సినిమా విడుదల కాకముందే సినిమా రికార్డుల మోత మోగిస్తుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ పరంగా మిలియన్స్ వ్యూయర్ షిప్ సంపాదించి ట్రెండింగ్ లో నిలిచింది. ఇప్పటికే పుష్ప సినిమాకు సంబంధించిన టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి.

అయితే మొన్ననే ప్రీ రిలీజ్ ముగించుకున్న పుష్ప మూవీ ట్రేడ్ పరంగా బాహుబలి మూవీ రికార్డులను అధిగమించిందని సమాచారం. ట్రేడ్ వర్గాల ప్రకారం పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 101.75 కోట్లు జరిగినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసిన చిత్రాల జాబితాలో ‘పుష్ప’ 4వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా కంటే ముందు వరుసలో బాహుబలి 2, సాహో, సైరా నరసింహారెడ్డి ఉన్నాయి. అయితే బాహుబలి 1 రికార్డును ‘పుష్ప’ అధిగమించిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.