Pushpa Movie: ఆ భాషలో మరొక రికార్డు సృష్టించిన పుష్ప.. ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్!

Pushpa Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మొట్టమొదటిగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషలలో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి అల్లు అర్జున్ కి పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి పేరు తీసుకు వచ్చిందని చెప్పవచ్చు.ఇకపోతే ఈ సినిమా దక్షిణాది రాష్ట్రాలలో కన్నా ఉత్తరాది రాష్ట్రాలలోని మంచి కలెక్షన్లను రాబట్టింది.

పుష్ప సినిమాను ఉత్తరాది రాష్ట్రాలలో పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టక పోయిన అక్కడి ప్రేక్షకులకు పుష్ప సినిమా విపరీతంగా నచ్చిందని చెప్పాలి. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ఏకంగా వంద కోట్లను రాబట్టింది. ఇలా బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని వంద కోట్ల క్లబ్లో చేరిన పుష్ప సినిమాని చూసి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు కూడా దక్కని కలెక్షన్లు రావడమే గమనార్హం.

ఇక ఈ సినిమాలో ప్రతి ఒక పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది శ్రీవల్లి పాటకు డాన్సులు చేస్తూ ఆ డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అదేవిధంగా పుష్ప రాజ్ డైలాగ్ లను సైతం తమదైన శైలిలో చెప్పడంతోనే ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రసారం అవుతున్నప్పటికీ ఈ సినిమాని థియేటర్లో చూడటం కోసమే ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఇలా పుష్ప సినిమా రికార్డులపై రికార్డులు సృష్టిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఈ నెల నుంచి పుష్ప పార్ట్-2 చిత్రీకరణ పనులు ప్రారంభం కానున్నాయి.