Pushpa: పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ నాకే రావాల్సింది : మహేష్ విట్టా

Pushpa : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఇటీవల తెరకెక్కిన సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకునే ఇప్పటికీ అదే రేంజ్ లో దూసుకుపోతోంది. ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన నటించిన జగదీష్ గురించి మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ సినిమా లో పుష్ప రాజ్ పాత్ర తర్వాత అంతటి పేరు కేశవ పాత్ర పోషించిన జగదీష్ కు వచ్చింది. అయితే అల్లు అర్జున్ పక్కన నటించిన కేశవ పాత్ర కోసం తాను కూడా ఆడియెన్స్ కి వెళ్ళాను అని తెలిపాడు మహేష్ విట్టా. కానీ చివరకు ఆ పాత్ర తనకు దక్కలేదని చెప్పుకొచ్చాడు.

పుష్ప సినిమాలో కేశవ పాత్ర పోషించేందుకుగాను ఆడిషన్స్ కోసం తాను వెళ్లాను అనీ మహేశ్ విట్టా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పుష్ప సినిమాలో కేశవ పాత్ర కోసం ఎంతో మందిని ఆప్షన్ గా పెట్టుకున్న డైరెక్టర్ సుకుమార్ చివరకు కేశవ పాత్ర కోసం జగదీష్ ని సెలెక్ట్ చేశాడు. అయితే ఒకానొక దశలో తాను కూడా సెలెక్ట్ అయ్యానని భావించాను అని మహేష్ విట్టా చెప్పుకొచ్చాడు. కానీ చివరకు తనను పిలవలేదని, జగదీశ్ ను ఆ పాత్రకు ఎంచుకున్నారని తెలిపాడు. తాను ఒకే సినిమా రెండేళ్ల సమయం ఇస్తానో లేదో అని అనుకున్నారే ఏమో తెలియదు.

కానీ, తాను మాత్రం తెరపైన కేశవ పాత్రను చూసి తెగ ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు మహేశ్ విట్టా. అయితే అంత మంచి పాత్ర కోసం తనను కూడా అనుకున్నందుకు తనకు సంతృప్తిగా ఉందని సంతోషం వ్యక్తం చేశాడు మహేష్ విట్టా. అయితే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా తనను ఏదో ఒక పాత్ర కోసం పిలుస్తారు అని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.