బన్నీ సినిమా గ్రాండ్ రిలీజ్ కానీ అక్కడ మార్కెట్ లేదే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (బన్నీ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “పుష్ప ది రైజ్”. టాలీవుడ్ మోస్ట్ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమా భారీ అంచనాలు నెలకొల్పుకుంది. అయితే అల్లు అర్జున్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఇది దీనితో అంతే స్థాయి అంచనాలు కూడా దీనిపై నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా ని యూఎస్ మార్కెట్ లో రిలీజ్ చెయ్యడం ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈ చిత్రంని అక్కడ హంసిని ఎంటర్టైన్మెంట్స్ వారు చాలా గ్రాండ్ రిలీజ్ కి అన్ని భాషల్లో కూడా ప్లాన్ చేస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమాని బన్నీ కెరీర్ లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారట.

కానీ అస్సలు యూఎస్ మార్కెట్ లో అల్లు అర్జున్ సినిమాలకి మార్కెట్ నే లేదు. టాప్ గ్రాసింగ్ సినిమాలు కూడా పెద్దగా అక్కడ లేవు. మరి ఈ సినిమా అంతా బన్నీ మీద కాకుండా సుకుమార్ సినిమా కంటెంట్ పైనే ఆధారపడి పెర్ఫామ్ చెయ్యాల్సి ఉంటుంది. మరి ఇంత స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి ఇక.