పుష్ప 2 విడుదలయ్యేది అప్పుడే.. సెంటిమెంట్ ఫాలో అవుతున్న మేకర్స్?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా గంధపుచెక్కల నేపథ్యంలో తెరకెక్కింది. ఇక ఇందులో పుష్ప రాజ్ స్మగ్లర్ గా కనిపించి ప్రేక్షకులను సందడి చేశారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇలా మొదటి పార్ట్ మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా మరో చిత్రాన్ని చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఎప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ అభిమానులు పెద్దఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ క్రమంలోనే సుకుమార్ ఈ విషయంపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. రాజశేఖర్ నటించిన శేఖర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా సుకుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్ప సినిమా గురించి ఆయన మాట్లాడుతూ పుష్ప 2 మరో నెలలో షూటింగ్ పనులను ప్రారంభించుకుంటుందని తెలిపారు.

ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను పూర్తిచేసుకుని సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.ఈ క్రమంలోనే ఈ సినిమాని వచ్చే ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు సుకుమార్ ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చారు. పుష్ప పార్ట్ 1 గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే పార్ట్ 2 ను కూడా డిసెంబర్ 2023 17వ తేదీ విడుదల చేయాలని ఈ సినిమా విడుదల విషయంలో కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పుష్ప2 కోసం అభిమానులు మరి కొంత కాలం పాటు వేచి చూడక తప్పదు.