Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం పుష్ప 2. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తక్కువ టైంలోనే ఎక్కువ కలెక్షన్స్ను సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది.. అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్న రికార్డులను సైతం బద్దలు కొట్టింది. మరీ ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా రికార్డులను సైతం కొట్టింది.
75 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1871 కోట్లను వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. 2024లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కూడా పుష్ప 2 మూవీ రికార్డును సృష్టించింది. అంతేకాకుండా సినిమా విడుదలైన ఆరు రోజుల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ మూవీగా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూలు సాధించిన చిత్రాల జాబితాలో దంగల్ రూ.2024 కోట్లు టాప్‌లో ఉండగా, పుష్ప2 మూవీ రూ. 1875 కోట్లతో రెండవ స్థానంలో ఉంది.
ముఖ్యంగా పుష్ప2 సినిమాకు బాలీవుడ్‌లోనే అత్యధికంగా కలెక్షన్స్ వచ్చాయి. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో పుష్పగాడికి ప్రత్యేక స్థానం దక్కింది. కేవలం హిందీ బెల్ట్ లోనే రూ. 850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అక్కడ త్రీడీ వెర్షన్ లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు ఓటీటీ కోసం రీలోడెడ్ వర్షన్ పేరుతో అదనం మరో 24 నిమిషాల సీన్లను కలిపారు. దీంతో ఈ మూవీ నిడివి మొత్తం 3 గంటల 40 నిమిషాలుగా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటివరకు దాదాపుగా రూ.1875 కోట్ల రూపాయలను సాధించినట్లు తాజాగా మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.