Pushpa 2: పుష్ప 2 సక్సెస్ అల్లు అర్జున్ కు వరమా… శాపమా… రెండింతలు కష్టపడాల్సిందేనా?

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప2. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఏకంగా పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాకుండా గ్లోబల్ స్టార్ రేంజ్ కు ఎదిగారు. పుష్ప సినిమా కలెక్షన్లు చూస్తే మతిపోవటం కాయం ఎంతోమంది స్టార్ హీరోల రికార్డులను కూడా ఈ సినిమా తిరగరాసిందని చెప్పాలి.

సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ లో కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇలా ఈ సినిమా ద్వారా బన్నీ ఉన్నఫలంగా నెంబర్ వన్ హీరో రేంజ్ కు వెళ్లారు. అయితే ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ కావటం అనేది బన్నీ కెరియర్ కు వరమా శాపమా అనేది అర్థం కావడం లేదు పుష్ప సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది అయితే తదుపరి సినిమా పరిస్థితి ఏంటనే సందేహం అందరిలోనూ కలుగుతుంది.

అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నారు అయితే ఒకప్పుడు ఉంటే ఈయన సినిమాలు గురించి ఇంత ఆసక్తి ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ పేరు వినపడితే చాలు ఓ రేంజ్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో పుష్పరాజు పాత్రలో బన్నీ ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయారు దీంతో తదుపరి సినిమాలో చేయబోయే పాత్ర పుష్పరాజ్ పాత్రకు మించినదై ఉండాలి అలా ఉన్నప్పుడే ఈయన గ్రాఫ్ అలాగే కొనసాగుతుంది కానీ లేకపోతే ఒక్కసారిగా ఈయన డౌన్ ఫాల్ కావలసి వస్తుందంటూ కొందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాతో తనకి ఏ రేంజ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారో తెలియాల్సి ఉంది.