పుష్ప 2 షూటింగ్ మొదలు కాకుండానే భారీఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్.. తగ్గేదే లే అంటున్న పుష్ప?

సాధారణంగా ఒక సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న తర్వాత అందులో నటీనటులు, ఆ సినిమా కథ ప్రాధాన్యత, ఆ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్,ట్రైలర్ టీజర్ చూసి పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది.అయితే ప్రస్తుతం సినిమాలు విడుదలై మంచి గుర్తింపు పొందిన తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ చిత్రంగా తెరకెక్కే సినిమాల విషయంలో సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే పెద్దఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఇలా పుష్ప సినిమా విడుదల అయ్యి పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే.

ఈ సినిమా ఊహించిన విధంగా నార్త్ ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా త్వరలోనే పార్ట్ 2 చిత్రీకరణ పనులను ప్రారంభించనుంది. ఇక ఈ సినిమా రెండవ భాగం షూటింగ్ మొదలు పెట్టకుండానే ఈ సినిమా భారీ ఎత్తున ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ విజయం కావడంతో అదే ధీమాతో రెండవ పార్ట్ పై కూడా భారీ అంచనాలు పెరిగాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కి గాను రూ. 300 కోట్లకి పైగా డీల్ వస్తున్నాయని సమాచారం.అలాగే డిజిటల్ హక్కులతో కలిపి ఈ సినిమా సుమారు 700 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా సినిమా షూటింగ్ ప్రారంభించకుండానే భారీ మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న హీరో అల్లుఅర్జున్ మాత్రమేనని చెప్పాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై అభిమానులు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.