Pushpa 2 : ఇన్సైడ్ టాక్ : “పుష్ప 2” కి మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్..’RRR’, ‘రాధే శ్యామ్’ రేంజ్ లో.!

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన నటిస్తున్న తాజా చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియన్ వైడ్ భారీ హిట్ అయ్యింది. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా టోటల్ పాన్ ఇండియన్ సినిమా దగ్గర సాలిడ్ హిట్ టాక్ తెచ్చుకుని ఇప్పుడు ఓటిటి లో కూడా అదరగొడుతుంది.

అయితే ఫస్ట్ పార్ట్ మంచి హిట్ కావడంతో సెకండ్ పార్ట్ కోసం అంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇంకా ఈ భారీ సినిమా షూటింగ్ ఇంకొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది అనగా ఆల్రెడీ ఈ సినిమాకి భారీ స్థాయి ఓటిటి ఆఫర్స్ వస్తున్నాయట. ప్రముఖ దిగ్గజ సంస్థలు పుష్ప 2 కి గాను ఏకంగా 400 నుంచి 450 కోట్లు ఆఫర్ ఇచ్చారట.

ఇది మాములు విషం కాదని చెప్పాలి. ఇలాంటి సాలిడ్ ఆఫర్స్ గతంలో “పుష్ప” కన్నా ఎక్కువ స్పాన్ ఉన్న ట్రిపుల్ ఆర్(RRR) మరియు ప్రభాస్ “రాధే శ్యామ్” లకి అది కూడా షూటింగ్ కంప్లీట్ అయ్యాక వచ్చాయి. కానీ పుష్ప కి ఇంకా షూట్ స్టార్ట్ కాకముందే రావడం ఊహించనిదే అని చెప్పాలి.

ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా నడుస్తున్న ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ టాక్.. అయితే ఇంకో విషయం పుష్ప మేకర్స్ ఆ భారీ ఆఫర్ కి సింపుల్ గా నో చెప్పేశారట.