తెలుగు సినిమాదగ్గర ఉన్నటువంటి టాప్ దర్శకులు మరియు నిర్మాతలలో డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ అలాగే నిర్మాత బండ్ల గణేష్ లు కూడా ఒకరు. మరి వీరి కాంబోలో అయితే ఒక సినిమా “టెంపర్” వచ్చి భారీ హిట్ అయ్యింది. ఇది బాగానే ఉన్నా తర్వాత మాత్రం వారికి మధ్యలో దూరం వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఇదిలా ఉండగా పూరి జగన్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “చోర్ బజార్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో బండ్ల గణేష్ ఆకాష్ ని లేపాలి పూరి జగన్నాథ్ పై కొన్ని సంచలన కామెంట్స్ నే చేశారు. దీనితో ఈ కామెంట్స్ పెద్ద లెవెల్లో హాట్ టాపిక్ గా మారాయి.
అయితే ఈ అంశంపై మాత్రం పూరి జగన్నాథ్ రెస్పాండ్ అవుతాడో లేదని అని అంతా అనుకుంటుండగా పూరి మాత్రం ఒక గట్టి కౌంటర్ బండ్ల గణేష్ కే ఇచ్చినట్టు తెలుస్తుంది. తాను చేసే వాయిస్ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ కొంతమంది ఎంత జాగ్రత్తగా మాట్లాడితే అది వారికే అంత మంచిది అని.
ఒకరితో ఎలా మాట్లాడుతున్నాం అనేది వారి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అవతల వారు గౌరవించాలా లేదా అనేది ఆ మాటల మీదే ఆధారపడి ఉంటుంది అని తెలిపాడు. దీనితో అయితే ఈ కౌంటర్ బండ్ల గణేష్ కి తన నోటి దురుసుకి కౌంటర్ ఇచ్చినట్టు ఉందని అంతా అనుకుంటుండగా ఇప్పుడు వీడియో వైరల్ అవుతుంది.