పూరి జగన్నాధ్ కల నెరవేరింది

పూరి జగన్నాధ్ అంటే ఒక సెన్సేషన్. హీరోయిజం కి కొత్త ఎలేవేషన్స్ ఇవ్వడం లో పూరి జగన్నాధ్ కి ఒక స్టైల్ ఉంది. పూరి సినిమాలు ప్లాప్ అయినా కానీ హీరో కారక్టరిజషన్ ఎప్పుడు నిరాశపరచలేదు. ఒకప్పుడు పూరి జగన్నాధ్ తో సినిమాలు చెయ్యాలని టాలీవుడ్ లో టాప్ హీరోలందరూ వెయిట్ చేసేవారు.

.సీనియర్ హీరోస్ లో ఒక్క నాగార్జున తో మాత్రమే పూరి సినిమాలు తీసాడు, ఆ తర్వాత చాన్నాళ్ళకి బాలకృష్ణ తో ‘పైసా వసూల్’ సినిమా చేసాడు. ఎన్నో హోప్స్ పెట్టుకున్న ‘లైగర్’ సినిమా ప్లాప్ అవ్వడంతో పూరి కి ఛాన్సెస్ రావు అనుకున్నారు, కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం చిరంజీవి తో పూరి ఒక సినిమా చేసే ఛాన్స్ వచ్చే లా ఉంది.

చిరు, పూరి కాంబినేషన్ లో ఎప్పుడో “ఆటో జానీ” రావాల్సి ఉంది. పైగా ఈ చిత్రం కూడా మెగాస్టార్ కం బ్యాక్ సినిమాలానే ఉంటుంది అని అప్పట్లో గట్టిగా వినిపించింది, కానీ ఆ సినిమా జరగలేదు. రీసెంట్ గా “గాడ్ ఫాథర్” సక్సెస్ తో ఓ ఇన్స్టాగ్రామ్ లైవ్ ని నిర్వహించగా అందులో చిరంజీవి పూరి ని మంచి  స్క్రిప్ట్ రెడీ చెయ్యమని చెప్పాడు. దానికి పూరి సాలిడ్ స్క్రిప్ట్ తో మీ ముందుకు వస్తాను అన్నాడు. మొత్తానికి చిరంజీవి, పూరి కలయిక లో ఒక సినిమా రెడీ అయ్యేలా కనిపిస్తుంది.