Puri Jagannath Disappointed : వైరల్ : ‘కేజీఎఫ్’ నుంచి కాపీ కొట్టి డిజప్పాయింట్ చేసిన పూరి జగన్నాథ్.!

Puri Jagannath Disappointed : టాలీవుడ్ నుంచి ఒక్కో దర్శకునికి ఎలా అయితే తమ సూపర్ మార్క్ ఉందో అలానే డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కి కూడా అలాంటి మార్క్ నే ఉంది. అయితే మళ్ళీ తన “ఇస్మార్ట్ శంకర్” తో ట్రాక్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ అదే స్పీడ్ లో స్టార్ట్ చేసిన చిత్రం “లైగర్”. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని అనౌన్స్ చెయ్యడంతో కాస్త పెద్ద ఎత్తునే అంచనాలు నెలకొన్నాయి.

పైగా పూరికి హిట్ ట్రాక్ అయిన బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో మరిన్ని అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా నుంచి రాబోతున్న అప్డేట్స్ పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చారు. ఈరోజు విజయ్ ఈ సినిమా గ్లింప్స్ పై క్లారిటీ ఇస్తూ ఒక అనౌన్సమెంట్ వీడియో ని రివీల్ చేశారు. ఇక ఇక్కడ నుంచి ట్రోల్స్ మొదలయ్యాయి.

ఈ వీడియో ని చూస్తే అచ్చు గుద్దినట్టు కన్నడ భారీ సినిమా కేజీఎఫ్ చాప్టర్ 1 టైటిల్స్ లానే యానిమేషన్ లో దింపేశారు దీనితో ఎంతో క్రియేటివ్ మైండ్ అయిన పూరి జగన్నాథ్ ఇలా చెయ్యడం ఏంటి విజయ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే యష్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి మాత్రం ఈ లైగర్ ఫస్ట్ అప్డేట్ తోనే పూరి డిజప్పాయింట్ చేసాడని కామెంట్స్ వస్తున్నాయి మరి సినిమాకి ఏం చేస్తాడో చూడాలి.