మీ బలమెంత అని అమిత్ షా ప్రశ్నించారు: పురంధేశ్వరి

బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ప్రస్తుతం ఏపీ లో జరుగుతున్న మాటల యుద్ధంను దృష్టిలోకి తీసుకొని పలు వ్యాఖ్యలు చేసింది. గతంలో మన మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం సరిగ్గా పట్టించుకోలేదని, బీజేపీ కార్యకర్తలు ఇచ్చిన రిప్రజెంటేషన్ లను మన మిత్రపక్షంగా ఉన్న వాళ్ళు చించేసేవారని అన్నారు.

పరిస్థితి ఇలా ఉందని అప్పుడే అమిత్ షా దృష్టికి తీసుకెళితే.. ఆయన మీ బలమెంత అని ప్రశ్నించారని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అని.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీ పునాదులు గట్టిగా ఉంటేనే ప్రతికూల పవనాల పరిస్థితి అనేది ఉండదని తెలిపారు.