ప్రచారం అదుర్స్.! జగన్ పరిపాలనకు జనం ‘జై’ కొడతారా.?

AP Ministers

 People’s Mandate : అప్పుడే 2024 ఎన్నికలకు గురించిన చర్చ ఎందుకు.? అనుకోవడానికి వీల్లేదు. ఏడాదిలోనో, రెండేళ్ళలోనో ఎన్నికలకు వెళతాం.. అంటూ ముందస్తు సంకేతాల్ని వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనతో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయ్.

విపక్షాలు ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా జిల్లాల పర్యటనల్లో బిజీగా వున్నారు. అధికార పార్టీకి, అధికారిక కార్యక్రమాలే పెద్ద అడ్వాంటేజ్. సంక్షేమ క్యాలెండర్ ఎలాగూ వుంది. సో, ప్రభుత్వం కోసం చేసుకునే పబ్లిసిటీ ద్వారా పార్టీకీ ప్రచారం కల్పించుకోవచ్చు.

పబ్లిసిటీ విషయంలో గతంలో చంద్రబాబు టాప్ క్లాస్. అంతకు మించిన స్థాయిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటోంది.

ఎడా పెడా మీడియా సంస్థల్ని వాడేస్తున్నారు.. ఇంకా చాలా చాలా హంగామా నడుస్తోంది.

ఇదంతా ఓ యెత్తు.. ఈ ప్రచార ఆర్భాటాల పట్ల ప్రజలేమనుకుంటున్నారు.? అన్నది ఇంకో యెత్తు. రాజకీయ పార్టీలు చేసే ప్రచార కార్యక్రమాలపై ప్రజలెప్పుడూ ఓ కన్నేసి వుంచుతారు. పాలన సరిగ్గా వుందా.? లేదా.? అన్నదానిపై అంచనాకి వస్తారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయంలో అప్రమత్తంగా వుండాలి.

రోడ్ల దుస్థితి సహా, చాలా అంశాలపై ఇంకా వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టకపోతే, పాలనకు నెగెటివ్ మార్కులు పడే అవకాశం లేకపోలేదు ఎన్నికల్లో.!