భారత ప్రభుత్వం PUBG సహా 275 చైనా యాప్ ల నిషేధించేందుకు సద్ధమవుతోంది. ఈ జాబితాలో టెన్సెంట్, జిలి షియోమి, అలీబాస్ గ్రూప్ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ అలీఎక్స్‌ప్రెస్ మద్దతు ఉన్న పియుబిజి ఉన్నాయి.
గత నెలలో టిక్‌టాక్, యుసి బ్రౌజర్‌తో సహా 59 చైనా యాప్‌లను భారతదేశంలో నిషేధించిన సంగతి తెలిసిందే. దేశీయంగా టిక్ టాక్ అభిమానులు ఈ దెబ్బకు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్‌లను నిషేధించిన తరువాత.. ఇదో ఆసక్తికర పరిణామం. తాజా సమాచారం ప్రకారం, జాతీయ భద్రతా ఉల్లంఘనలు .. వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించే 275 యాప్ లను భారత ప్రభుత్వం పరిశీలించింది. వీటిలో భద్రతా ఉల్లంఘన కనుగొంటే వెంటనే నిషేధం అమలవుతుందని తెలుస్తోంది.
భారతదేశం యొక్క సార్వభౌమాధికారం సమగ్రతకు భంగం కలిగినా.. భారతదేశ రక్షణ, రాష్ట్రాల భద్రతకు ప్రజల భద్రతకు ముప్పు కలిగించే విధంగా పలు యాప్ లు గోప్యంగా సమాచారాన్ని చైనాకు బదిలీ చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రఖ్యాత షియోమి కి సంబంధించిన 14 యాప్ లు.. క్యాప్‌కట్, ఫేస్‌యూ, మీటు, ఎల్‌బిఇ టెక్, పర్ఫెక్ట్ కార్ప్, సినా కార్ప్, నెట్‌సేస్ గేమ్స్ – యూజూ గ్లోబల్ వంటి యాప్ లపై ప్రభుత్వం దృష్టి సారించిందని సమాచారం. వీటిలో పలు చైనా టెక్ కంపెనీల పెట్టుబడులను కలిగి ఉన్నాయని వెల్లడైంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మీటీవై) మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి ఈ వివరాల్ని వెల్లడించారు. PUBG భారతదేశంలో అతిపెద్ద వినియోగదారుల సంఖ్యను కలిగి ఉంది. సుమారు 175 మిలియన్ డౌన్‌లోడ్‌లు కలిగి ఉంది. పబ్ జీతో పాటు లూడో గేమ్ కి ఇండియాలో వీరాభిమానులు ఉన్నారు. PUBG చైనా యాప్ కాదు. దక్షిణ కొరియా కంపెనీ టెన్సెంట్ గేమ్స్ క చెందినా దీని మొబైల్ వెర్షన్స్ కి చైనా కంపెనీ పెట్టుబడులు ఉన్నాయి. తాజా నిషేధ వార్త పబ్ జీ గేమ్ ప్రేమికులకు అభిమానులకు అతి పెద్ద బ్యాడ్ న్యూస్.