Posani: అరెస్ట్ అయిన నటుడు పోసాని…. తగిన శాస్తి జరిగిందన్న నటుడు పృథ్వీరాజ్… పోస్టు వైరల్!

Posani: సినీ నటుడు పోసాని కృష్ణమురళి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈయన కూటమినేతల గురించి గతంలో మాట్లాడిన వ్యాఖ్యలపై కొందరు ఈయన పట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో నిన్న సాయంత్రం పోలీసులు హైదరాబాద్లోని పోసాని ఇంటికి వెళ్లి ఆయనని అదుపులోకి తీసుకున్నారు.

ఇలా పోసాని కృష్ణమురళి అరెస్టు కావడంతో పెద్ద ఎత్తున ఈ విషయంపై ఏపీ రాష్ట్ర రాజకీయాలలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోసాని అరెస్టుపై 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వీరాజ్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ పోస్టు చేశారు. ఇటీవల ఎక్స్ లోకి అడుగుపెట్టిన ఈయన తాజాగా పోసాని అరెస్టు గురించి కూడా స్పందించారు.

నోటి దూలకు తగిన శాస్తి తప్పదు. నిజం ఎప్పుడూ న్యాయానికి తోడుగా నిలుస్తుంది. మాట చాలా విలువైనది. అందుకే ఎప్పుడూ పొదుపుగా వాడాలి. నిజం తెలుసుకొని ఎప్పుడు ఆగిపోవాలో తెలిసిన వాడే మహాపురుషుడు అంటూ ఈయన చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ పోస్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

నోటి దూల గురించి మాటలు పొదుపుగా మాట్లాడటం గురించి నువ్వే మాట్లాడాలి అంటూ ఈయన పై విమర్శలు చేస్తుండగా మరికొందరు పృథ్వి మాటలను సమర్థిస్తున్నారు. మొత్తానికి పోసాని అరెస్టు గురించి స్పందిస్తూ ఈయన చేసిన పోస్ట్ ద్వారా మరోసారి పృథ్వి వార్తలలో నిలిచారు. ఇక వైసీపీను టార్గెట్ చేస్తూ ఈయన ఇలాంటి పోస్టులు చేయడం కోసమే X లోకి అడుగు పెట్టాను అంటూ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.