ప్రజెంట్ ఇండియాలో హయ్యస్ట్ పెయిడ్ స్టార్ హీరో ఎవరు అంటే అనుమానం లేకుండా ప్రభాస్ అనే అనాలి. ‘బాహుబలి’తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. తెలూహ్గులో ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో హిందీలో కూడ అంతే క్రేజ్ ఉంది ఆయనకు. ‘సాహో’ సినిమాలో తెలుగు వాళ్లకు నచ్చకపోయినా హిందీ వాళ్లకు విపరీతంగా నచ్చింది. 150 కోట్ల వసూళ్లను రాబట్టింది. అది చూసిన నిర్మాతలు హిందీ ప్రేక్షకుల్లో ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకున్నారు. అందుకే ఆయనతో సినిమా చేయడానికి ఎగబడుతున్నారు.
మరి ఇండియా లెవల్లో ఇంత డిమాండ్ ఉంటే రెమ్యునరేషన్ కూడ అదే స్థాయిలో ఉంటుంది కదా. ప్రస్తుతం ప్రభాస్ మూడు భారీ సినిమాలకు సైన్ చేసి ఉన్నాడు. వాటిలో ఒక్కొక సినిమాకు 100 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నాడు. ఇండియాలో ఇంతవరకు సినిమాకు 100 కోట్లు తీసుకున్న హీరో లేడు. అయితే అంతటితో ప్రభాస్ ఊరుకోవట్లేదు. సినిమా లాభాల్లో కూడ షేర్ తీసుకుంటున్నాడట. ప్రేక్షకుల్ని భారీగా థియేటర్లకు రప్పించగల సత్తా, బిజినెస్ వర్గాల్లో విపరీతమైన హైప్ కలిగిన హీరో గనుక నిర్మాతలు కూడ ఆయన మీద ఎంత పెట్టినా వెనక్కు రాబట్టుకోవచ్చనే నమ్మకంతో మరో మాట లేకుండా ఆయన అడిగినంతా ఇచ్చేస్తున్నారట.