సినీ కార్మికుల వేతనాలు పెంచడానికి నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది లేదు: సి. కళ్యాణ్

అన్ని పరిశ్రమల కార్మికులలాగే సినీ పరిశ్రమకు చెందిన కార్మికులు కూడా వేతనాలు పెంచాలని ఇటీవల సమ్మె చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే కార్మికులందరూ సమ్మె చేస్తూ బుధవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయాన్ని ముట్టడించి వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సినీ కార్మికులు వేతనాల పెంపు కోసం నిర్వహించిన సమ్మె గురించి నిర్మాతల మండలి ఎట్టకేలకు స్పందించింది. ఈ విషయంపై బుధవారం మధ్యాహ్నం నిర్మాతల మండలి సమావేశమై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను మీడియా ద్వారా తెలియజేశారు.

సినీ కార్మికుల సమ్మె గురించి నిర్మాతల మండలి సమావేశమై చర్చించుకున్న తర్వాత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సినీ కార్మికులకు వేతనాలు పెంచేందుకు నిర్మాతలకి ఎలాంటి ఇబ్బంది లేదు..ప్రస్తుతం నిర్మాతలు షూటింగ్స్ కి సిద్దంగా ఉన్నారు. అందువల్ల కార్మికులంతా గురువారం నుండి యధావిధిగా షూటింగ్స్‏లో పాల్గోనాలని ఆయన కోరారు. వేతనాల పెంపు గురించి మొదట కార్మికులు జూన్ 6 తేదీన ఒక లేఖ కూడా రాశారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

కానీ అంతలోనే కార్మికులు సమ్మె చేయటం తెల్సుకొని నిర్మాతలందరూ షాక్ అయ్యారు.ఇండస్ట్రీలో కార్మికుల పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు వేతనాలను పెంచుతూనే ఉన్నాం. కానీ కార్మికుల వేతనాలు మరింత పెంచాలని కోరుతూ ఈనెల 6న వాళ్లు మాకు ఓ లేఖ రాసిన సంగతి నిజమే… వేతనాలు పెంచడానికి నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది లేదు.. కానీ కార్మికుల వేతనాలు పెంచాలంటే మాకు కూడా కొన్ని షరతులు ఉంటాయి. ఈ విషయం గురించి అందరం కలిసి చర్చించుకుందామని వాళ్లకు చెప్పాం.. కానీ వాళ్లు ఇలా సడెన్ గా సమ్మె చేయడం చాలా పొరపాటు. కార్మికుల వేతనాలు పెంచటానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి గురువారం నుంచి కార్మికులందరూ యధావిధిగా షూటింగ్స్ లోకి వస్తేనే వేతనాల గురించి చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం. లేదంటే నిర్మాతలు కూడ షూటింగ్స్ నిలిపివేయటానికి కూడా సిద్దంగా ఉన్నారు. నిర్మాతలు సినిమాలు చేస్తేనే అందరికీ పని ఉంటుంది…అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.