“మహేష్ 28” పై అప్డేట్ ఎందుకు ఇవ్వట్లదో నిర్మాత ఆసక్తికర క్లారిటీ వైరల్.!

ప్రస్తుతం టాలీవుడ్ ఆల్ టైం హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ మరో హిట్ సర్కారు వారి పాట సినిమాతో అందుకొని ఇప్పుడు ఫ్యామిలీ తో వెకేషన్ లో ఉన్నాడు. మరి ఈ వెకేషన్ తర్వాత మహేష్ ఇండియాకి వచ్చి తన కెరీర్ లో కెరీర్ లో ప్లాప్ ఇచ్చినా మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ సినిమా చేయనున్నాడు.

అయితే దీనిని కూడా భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్ సినిమాగా అనౌన్స్ చెయ్యగా మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా అప్డేట్ కోసం ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న అభిమానులకి అయితే ఈ సినిమా నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఇక ఆసక్తికర క్లారిటీ ని తాము ఎందుకు ఇంకా అప్డేట్ ఇవ్వట్లేదు అనే దానిపై ఇచ్చాడు.

దయచేసి ఫ్యాన్స్ అంతా మా పరిస్థితి కూడా అర్ధం చేసుకోవాలి, మాకు కొంచెం టైం ఇవ్వండి, అన్నీ సమయానికి తగ్గట్టుగా వస్తాయి, మహేష్ త్రివిక్రమ్ గారు 12 ఏళ్ళు తర్వాత చేస్తున్న సినిమా ఇది అందుకే తప్పకుండా చాలా స్పెషల్ గా ఈ సినిమా ఉంటుంది. అలాంటప్పుడు అప్డేట్స్ కూడా స్పెషల్ గానే ఉండాలి అందుకే సరైన సమయం వచ్చినపుడు మేమే అందిస్తాం ఈ సినిమా మీకు మాకు మంచి మెమొరబుల్ గా నిలిచిపోతుంది అని తెలిపి మహేష్ ఫ్యాన్స్ ని శాంతపరిచారు.